సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తుపాను కు నష్టపోయిన రైతులను పరామర్శించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నేడు, శనివారం బాపట్ల జిల్లా లో పర్యటించి, పర్చూరు మండలం చెరుకూరు సభలో మాట్లాడుతూ.. మురికి కాలువలో మురికి తీయాలన్న బుద్ధి జ్ఞానం ప్రభుత్వానికి ఉండాలని, రైతులకు గోతాలు కూడా ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వమని చంద్రబాబు మండిపడ్డారు. తుఫాన్ కారణంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రైతులంతా నష్టపోయారని అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం గాల్లో తిరిగి.. గాల్లోనే తాడేపల్లి వెళ్లిపోయాడని చంద్రబాబు విమర్శించారు. తుఫాన్ కారణంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రైతులంతా నష్టపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా హృదయ విదారకంగా ఉందని, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే “టీడీపీ ప్రభుత్వంలో వచ్చిన ఎన్నో తుఫానులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఒక వ్యక్తి అహంకారానికి రైతులు బలైపోయారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క రోడ్డు బాగుందా. అన్ని వ్యవస్థలు నాశనం చేశాడు. రైతులు తరపున న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా. రైతు రాజ్యం తీసుకురావడానికి టీడీపీ – జనసేన కలిసి పనిచేస్తాయి. ప్రజల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నా. తుపాను కారణంగా భారీ నష్టం జరిగితే ముఖ్యమంత్రి కేంద్రాన్ని సాయం కూడా అడగలేదు. ఏపీకి సాయం కోసం ప్రధానికి నేనే లేఖ రాస్తా.” అని చంద్రబాబు అన్నారు.
