సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంనియోజవర్గంలో వేసవి వేడికి తోడు రోజురోజుకు రాజకీయ వేడి పెరిగిపోతుంది. ఇటు వైసీపీ అటు జనసేనలో రోజు రోజుకు పలు వార్డులలో మా పార్టీలో ఇంతమంది చేరారు అంటే మా పార్టీలో ‘అంతకు మించి’ చేరారు అన్న ఫోటోలు షరామామూలుగానే వస్తున్నప్పటికీ.. తాజగా పట్టణంలోని కీలక వర్గాల ఓట్లను ప్రభావితం చేసే కొందరు కీలక నేతలు వైసీపీ లో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో చేరటం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. గతంలో టీడీపీ లో అంజిబాబు పునరాగమనాన్ని బహిరంగంగా వ్యతిరేకించిన.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అడ్జక్షురాలు తోట సీతారామ లక్ష్మి కుటుంబానికి దశాబ్దాలుగా టీడీపీ పార్టీకి అతి సన్నిహితంగా మెలిగిన రుద్రరాజు రఘురామరాజు ( అభిరుచి రఘు) వైసీపీలో చేరిపోయారు. ఇక నేటి బుధవారం రాత్రి జనసేన నాయకుడు అడపా ఏడుకొండలు స్థానిక క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైసిపి పార్టీలో చేరారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కూటమి పేరుతొ అధినేతల స్వార్ధం కోసం.. పార్టీల శ్రేయస్సు కోసం సర్వము ఒడ్డి పోరాడే క్యాడర్ ను వదిలేసి అక్కరకు రాని నేతలను అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారని..అందుకే భీమవరంలోని జనసేన, తెలుగుదేశం, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు వారి ఆత్మాభిమానం మన భీమవరం అభివృధి కోసం వినియోగిస్తే మంచిదని.. అందరు వైసీపీలో చేరి నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చెయ్యి చెయ్యి కలపాలని పిలుపు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రంధి బాలాజీ, చిన్నమిల్లి వెంకటరాయుడు, బండి శక్తిశ్వర సాంబమూర్తి, చెలంకూరి వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *