సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాడేపల్లి గూడెం లో పవన్ కళ్యాణ్ సీఎం జగన్ నుద్దేశించి చేసిన తీవ్ర వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులు అంబటి , గుడివాడ అమర్నాధ్ వంటి నేతలు కౌంటర్ ఇచ్చారు. అయితే ప్రశాంతంగా విభిన్నంగా మాట్లాడే.. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 6 లక్షల సభ అన్నారు.. పట్టుమని 60వేలమంది రాలేదు.. అక్కడే మీ టీడీపీ జనసేన పొత్తును ప్రజలు, మీ నేతలే అస్యహించుకొంటున్నారని అందరికి అర్ధం అయ్యింది. పవన్ ఆ సభలో కాపుల ఆత్మ గౌరవాన్ని పెంచే ఒక్క మాట కూడా చెప్పలేరు. మీటింగ్ అంత చంద్రబాబు ను జాకీలు పెట్టి పవన్ ఎత్తేసిన ఆయన ఎక్కడ పవన్ వీరుడు శురుడు అని అనలేదని, పవన్ తనను సెల్ఫ్ డబ్బా కొట్టేసుకొంటూ తాను ఎవరో సినిమా వారు రాసిచ్చిన డైలాగ్స్ సొల్లు మాట్లాడేసాడని, నిజానికి పురాణాల్లో పవన్‌ను పోల్చాలంటే శల్యుడి పాత్ర ఒక్కటే ఉందని, అన్ని ఆస్తులు అమ్ముకొని జనసేన పార్టీ కోసం సర్వము ఒడ్డిన కర్ణుడి లాంటి జనసైనికులను మనకు ఎన్నికలలో పోటీ చేసే సత్తా లేదు..బూత్ కమిటీలు లేవు. వందమందికి భోజనం పెట్టలేము.. చంద్రబాబు సాయం లేకుండా మనం గెలవడమేమిటి? అని భయపెటేస్తున్నాడని ఎద్దేవా చేశారు సీఎం జగన్ తల్లిని, చెల్లిని వదిలేసాడని తోసేశాడని ఎదో చూసినట్లు మానవత్వం లేని మాటలు మాట్లాడుతున్నాడని, మరి పవన్ తల్లి, చెల్లి చిరంజీవి దగ్గర ఉన్నారని, పవన్ ఎప్పుడైనా వారిని పట్టించుకోని మంచి చెడ్డ చూసాడా? పైగా తన నాలుగవ పెళ్ళాంగా జగన్ ను రా అని పిలుస్తున్నాడని, ఇప్పటి వరకు రాజకీయాలలోనే ‘తేడా’వని అనుకున్న మగాడిని పెళ్లి చేసుకొంటానని అన్నాడంటే ఆ విషయంలో కూడా ‘తేడా’ లక్షణాలు పవన్ లో కనిపిస్తున్నాయి అని సెటైర్ వేశారు. వైసీపీ ని భూ స్థాపితం చేస్తానని అన్నావు.. ఈ ఎన్నికలు తరువాత టీడీపీ జనసేన జెండాలు ప్రజలే మడిచి పెట్టేయడం ఖాయం.. సీఎం జగన్ దగ్గర బేరాలు ఉండవమ్మా .. పవన్‌కు చేతనైంది చేసుకోవచ్చు అని సవాల్ విసిరారు పేర్ని నాని.. .
