సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల టీడీపీ తో పొత్తు తోనే వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ ప్రకటించిన నేపథ్యంలో భవిషత్తు కార్యాచరణలో సీట్ల కేటాయింపులో మునుముందు పేచీలు లేకుండా ముందే సమన్వయముతో బంధాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఈ సెప్టెంబర్ నెలలోనే ఇరుపార్టీలు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నాయి. ఈ సమావేసాలు ఈ నెల 4వ వారంలో ప్రారంభం అయ్యే అవకాశలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాలలో టీడీపీ – జనసేన మధ్య అవగాహనతో విజయదశమి కి పోటీ చేసే ఇరు పార్టీల అభ్యర్థుల మొదటి లిస్ట్ సిద్ధం చేసుకోవాలని ప్యూహం సిద్ధం చేసుకొన్నట్లు తెలుస్తుంది. ఇరుపార్టీలు సమన్వ య కమిటీ సమావేశం లో కమిటీ సభ్యు ల నియామకం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించి సీనియర్ నేతలతో చర్చించారు. జనసేన క్యాడర్ సమన్వయ బాధ్య తలు నాదెండ్ల మనోహర్ నిర్వహిస్తారు. ఈ కమిటీలో తెలంగాణ నుంచీ ఓ సభ్యుడిని నియమించే అవకాశం జనసేన లో ఉంది. ప్రస్తుతము నారా లోకేశ్ పర్యటన ఢిల్లీ లో కొనసాగుతోంది. ఆయన వచ్చిన తర్వాత జైలులో చంద్రబాబును కల్సి ఆయన సూచనలతో టీడీపీ సమన్వయ కమిటీ సభ్యు లను ప్రకటిస్తారు.
