సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బిఆర్ అంబేడ్కర్ భవనంలో టీడీపీ పట్టణ ఎస్సీ సెల్ అధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ముందుగా క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. టిడిపి పొలిట్ బ్యూరో, సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు ప్రభువు అంటేనే ప్రేమ, దయ, క్షమ గుణాలకు ప్రతిరూపమని, ప్రపంచానికి శాంతియుత మార్గాన్ని చూపి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలన్నారు. దయ, ప్రేమ, శాంతి, సేవా గుణాలను నేర్పించిన త్యాగమూర్తి ఏసుప్రభువు అని, కుల మతాలకు అతీతంగా వేడుకలు అందరము కలిసికట్టుగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారధి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ మెరగని నారాయణమ్మ,కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు,వేండ్ర శ్రీనివాస్ ఎస్సీ సెల్ సభ్యులు మాజీ కాన్సిలర్లు యాళ్ళ వెంకటేశ్వరరావు, ఎద్దు ఎసుపాదం, మైలబత్తుల ఐజాక్ బాబు, మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ తదితరులు మాట్లాడుతూ క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన చూపిన బాటను అనుసరించాలన్నారు.
