సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ ఆద్వర్యంలోని ఎన్డీయే లో టీడీపీ చేరుతోంది అని వస్తున్నా జాతీయ మీడియా వార్తలపై ఆయన స్వాందిస్తూ .. ఆ వార్తలపై వివరణ ఆ మీడియా ఛానెల్స్ వారినే అడగాలని , ఏది ఏమైనా రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే అపట్లో కేంద్ర రాజకీయాలను చూస్తామని, తాను అధికారంలో ఉన్నప్పుడు పాలనపై ఎక్కువ దృష్టిపెట్టడంతోనే పార్టీ రెండుసార్లు నష్టపోయిందని తెలిపారు. ( 2 సారులు బీజేపీ తో పొత్తు వదులుకొని నష్టపోయానని పరోక్షంగా ఒప్పుకొన్నారు) ఏపీకి మంచిపేరు తీసుకురావాలనే తపనతో వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయామని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే.. సీఎం జగన్‌ వల్ల రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరుగుతోందని, ఆయన సీఎం అయ్యాక వ్యవస్థలు నాశనం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. అసలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది టీడీపేనని ప్రకటించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు రెట్టింపు సంక్షేమం ఇస్తామని భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *