సిగ్మాతెలుగు డాట్, న్యూస్: ఢిల్లీలో ఎన్డీయే ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన సమావేశాని కి హాజరయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు లో అధికార వైసిపిని ఓడించడమే లక్ష్యంగా జనసేన బీజేపీ తో పాటు తెలుగుదేశం తో కూడా పొత్తు కోసం స్వష్టంగా సంకేతాలు ఇచ్చినట్లు ఒక వర్గం మీడియాలో ప్రచారం జరుగుతున్నా నేపథ్యంలో ..తాజాగా పొత్తుల విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు.నేడు, బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పొత్తుల విషయం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని తెలిపారు. సరైన సమయంలో సరైన నిర్ణయం బీజేపీ పెద్దలు తీసుకుంటారని చెప్పారు. మరి పవన్ టీడీపీ తో కూడా పొత్తు ప్రతిపాదన విషయానికి వస్తే.. ‘‘జనసేన మా మిత్రపక్షం.. పోన్‌లో పవన్ కళ్యాణ్‌తో మాట్లాడాను.. త్వరలో అవకాశం బట్టి కూర్చుని మాట్లాడుకుంటాం’’ అని మాట తప్పించారు, ఏపీ అప్పుల ఆంధ్రగా, అంధకార ఆంధ్రప్రదేశ్‌గా మారిందని.. ఏపీపై విభజన నాటికి రూ.97వేల‌ కోట్ల భారం ఉందని చెప్పారు. ఐదేళ్ల టీడీపీ,చంద్రబాబు పాలనలో‌ రూ.2,65,365 కోట్లు అప్పు చేశారని.. నలభై వేల కోట్లు కాంట్రాక్టర్‌లకు బిల్లులు చెల్లించలేదని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జులై వరకు నాలుగేళ్లల్లో రూ.7,14,631 కోట్లు అప్పు చేశారన్నారు. రూ.2లక్షల 39వేల 716 కోట్లు అధికారికంగా, రూ.4లక్షల 74వేల 315 కోట్లు అనధికారికంగా? అప్పు తెచ్చారని ఆరోపించారు.. ఆ అప్పులపై జగన్మోహన్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *