సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిప్పు లేనిదే పొగ రాదంటారు.. కానీ పొగ వచ్చిన కూడా అసలు నిప్పు ఎక్కడ ? అని ప్రశ్నిస్తే.. అలా ఉంది ఉండి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి.. అసలే మాజీ ఎమెల్య శివరామరాజు టికెట్ ఆశించి భంగపడి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి పార్టీని వణికిస్తుంటే.. మరో ప్రక్క ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు తనవంతు కష్టపడుతూ ఎలాగైనా 2వ సారి అభ్యర్థిత్వం వచ్చినందుకు గెలచి తీరాలని ప్రచారంలో దూసుకొని పోతున్న నేపథ్యంలో .. ఎంపీ రఘురామరాజు కు ఉండి టికెట్ కేటాయింపు జరిగిపోయిందని నిన్న జరిగిన ప్రచారానికి, తత్ఫలితంగా జరిగిన ఆందోళనకు కేంద్ర స్థానం పాలకొల్లులో చంద్రబాబు నిర్వహించిన సమావేశం కావడం గమనార్హం.. చంద్రబాబు నిన్న శనివారం నరసాపురం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంతలో చంద్రబాబు రామరాజుతో సాయంత్రం ఉండి సమీక్ష వస్తుంది . మీతో ప్రత్యేకంగా మాట్లాడే పని వుంది.. మీరు ఉండాలి అనడంతో..దీంతో టిక్కెట్ మార్పు ఖాయమంటూ.. ఎంపీ రఘురామరాజు కు టికెట్ ఖాయం చేసారని అక్కడ హాజరైన టీడీపీ నాయకులంతా భావించారు. మరోవైపు ఎమ్మెల్యే అనుచరవర్గం, టీడీపీ నాయకులు చంద్రబాబు సమీక్ష చేస్తున్న ఎస్.కన్వెన్షన్ వద్దకు చేరుకుని చంద్రబాబు కు వ్యతిరేకంగా పెద్దగా అరుస్తూ తీవ్ర ఆందోళనకు దిగారు. అయితే దీనిని ఎమ్మెల్యే రామరాజు , అటుగా భీమవరం లో మీడియా సమావేశంలో ఎంపీ రఘురామా కూడా ఖండించారు. టిక్కెట్ మార్పు పై చంద్రబాబు తమతో ఏమీ చెప్పలేదంటూ మీడియాకు తెలిపారు. గత సాయంత్రం రామరాజు, మాజీ మంత్రి పితాని, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తో చంద్రబాబు గోప్యంగా సమాలోచన చేసినట్లు భావిస్తున్నారు. ఏదిఏమైనా ఎంపీ రఘురామా రాజు కు అవసరమైతే ఉండి టికెట్ కేటాయించి తీరుతారని టీడీపీ వర్గాలే బలంగా నమ్ముతున్నాయి. అయితే అధికారిక ప్రకటన రానప్పటికీ టీడీపీ కంచుకోట గా భావించే ఉండి నియోజకవర్గంలో సమన్వయ లోపంతో .. యాదృచ్చికంగా రామరాజు పేర్లు ఉన్న ఒకే పార్టీకి చెందిన ‘ముగ్గురు రామరాజులు’ పోటీ చేసే పరిస్థితి రావడం టీడీపీ వర్గాలను అయోమయానికి గురిచేస్తున్నాయి. RRR సినిమాలో ఎలా అయితే ప్రాణ స్నేహితుల మధ్య పోరు తప్పలేదో? అలా ‘సీటు’ కోసం పోరాడకతప్పని పరిస్థితి ఇక్కడ.. 2004 లో ఈ కంచుకోట ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వర్గీయ పాతపాటి సర్రాజు అపట్లో జిల్లా లో20 వేలు పైగా అత్యధిక మెజారిటీ గెలచి ఔరా అనిపించారు. ఒకవేళ 3వర్గాలుగా టీడీపీ పార్టీ చీలిపోతే స్థానిక వైసీపీ అభ్యర్థి గా 2వ సారి బరిలో ఉన్న పివిఎల్ నరసింహ రాజు భారీ మెజారిటీ తో గెలవడానికి మార్గం సుగమనం అవుతుందని వైసీపీ వర్గాలు మెజారిటీ లెక్కలు వేసుకొంటున్నారు. .. సిగ్మాప్రసాద్ కాలమ్స్
