సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికలు కు గడువు సమీపిస్తోంది. టీడీపీ- జనసేన పార్టీలు పొత్తులో ఉన్నా కూడా ఇంకా అభ్యర్థుల సీట్లు అధికారికంగా ప్రకటించడం లేదు. దీనికి ఇంకా ఇరుపార్టీల పెద్దల మధ్య కొన్ని సీట్లు ఇబ్బంది పెడుతున్నాయని తెలుస్తుంది. పైకి గుంభనంగా ఉన్నపటికీ టీడీపీ జనసేన సీట్ల కోసం ప్యూహాత్మకంగా ఎత్తుకు ఫై ఎత్తులు వేసుకొంటున్నారు. ఇదిలా ఉండగా జనసేనను సంప్రదించకుండా టీడీపీ అధినేత చంద్రబాబు “మండపేట, అరకు ఈ రెండు నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ కొంత కినుక వహించారు. అందుకే దానికి కౌంటర్ గా నేడు, శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదు.. కానీ చేశారు. అందుకు జనసేన పార్టీ నేతలకు నేను క్షమాపణలు చెప్తున్నా. టీడీపీ సీట్లు అనౌన్స్ చేయడం పార్టీలోని కొందరు నేతలను ఆందోళనకు గురి చేసింది’”మండపేట, అరకు అభ్యర్థులను టీడీపీ ఏకపక్షంగా ప్రకటించడం పొత్త ధర్మం కాదు.. టీడీపీ రెండు సీట్లు ప్రకటించింది కాబట్టి మేము కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నాం అంటూ రాజోలు,రాజానగరం లో జనసేన పోటీ చేస్తుందని” ప్రకటించారు. నాకు టీడీపీ దగ్గర పొత్తులో భాగంగా 50 సీట్లు తీసుకోవాలా? 60 సీట్లు తీసుకోవాలో బాగా తెలుసు ఎవరు ఆందోలన పడనక్కరలేదు..అంత అవగాహన లేనివాడిని కాదు అంటూ పవన్ మరో ఝలక్ ఇచ్చారు..
