సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) విశ్వవిజేతగా భారత్ అవతరించిన నేపథ్యంలో నిన్న(ఆదివారం)రాత్రి భీమవరంలో మరో దీపావళి పండుగ కనిపించి ఆకాశం అంతా రాత్రి బాణాసంచా కాల్పులతో కాంతులతో నిండిపోయింది. క్రికెట్ అభిమానులు ఆనందం పట్టలేక బైక్ లపై జోరుగా సవారీ చేస్తూ అరుపులతో కేకలతో సందడి చేసారు. మరికొందరు మువ్వనేల జెండాలు చేతబూని రోడ్లపై స్వీట్స్ పంచుతూ పండుగ చేసుకొన్నారు. గత రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఏకంగా 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి, మొత్తంగా మూడుసార్లు టైటిల్ అందుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డ్ తో అరుదయిన ఘనత సాధించింది.
