సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో టెట్ , డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు తాజగా నేడు, సోమవారం ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెట్ , డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్ట్ తీర్పునిచ్చింది. మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్‌ను ధర్మాసనం సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చ్ 14న వస్తున్నాయని, మార్చ్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై హైకోర్ట్‌లో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై జరిగిన విచారణలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు తో ఎన్నికల లోపు డీఎస్సీ పరీక్షలు పూర్తీ చేసి పోస్ట్లు ప్రకటించాలని చుసిన ఏపీ సర్కార్ ఇప్పుడు కొంత ఇబ్బంది పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *