సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో శ్రీ సాగిరాజు రామకృష్ణంరాజు (SRKR )ఇంజినీరింగ్‌ కళాశాల టోస్ట్‌ మాస్టర్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ 126 విభాగంలో ప్రతిష్టాత్మక అవార్డుల ను అందుకుందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కెవి.మురళీకృష్ణంరాజు ప్రకటించారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న విద్యార్థులను కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ సాగి రామకృష్ణ నిశాంత్‌ వర్మ అభినందించారు. టోస్ట్‌మాస్టర్స్‌ క్లబ్‌ డివిజన్‌ పినాకిల్‌ అవార్డు, డివిజన్‌ రిటెన్షన్‌ క్యాంప్స్‌ అవార్డు, డిస్ట్రిక్ట్‌ ఎపిక్‌ అవార్డు, డిస్ట్రిక్ట్‌ రిటెన్షన్‌ ఎక్సలెన్స్‌ డిస్ట్రిక్ట్‌ గోల్డెన్‌ క్లబ్‌ అవార్డుతోసహా పలు ప్రతిష్టాత్మక అవార్డులను గత మేలో హైదరాబాదులో జరిగిన డిస్ట్రిక్ట్‌ 126 కాంపిటీషన్స్‌లో ఈ విజయాలను అందుకున్నారు. అవార్డులు అందుకున్న విద్యార్థులను కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.జగపతిరాజు, ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ హెడ్‌ డాక్టర్‌ బిహెచ్‌విఎన్‌.లక్ష్మి తదితరులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *