సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో పాకిస్తాన్ ఫై భారత్ యుద్దాన్ని తానే బెదిరించి అపానని ఇప్పటికే పలు మారులు ప్రకటించి సంచలనం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజగా రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారంటూ చేసిన ప్రకటన భారత్ లో మరో అలజడి రేపింది. ప్రస్తుతం భారీ కలకలాన్ని రేపాయి. దీనికి కూడా ప్రధాని మోడీ డైరెక్ట్ గా ట్రంప్ ను ఖండించక పోవడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానిపై విమర్శలు దాడి చేసారు. భారత విదేశాంగ విధానాన్ని మోదీ ట్రంప్ చేతుల్లో పెట్టారని, మోదీకి ట్రంప్ అంటే భయం అని ఇప్పటికే పలుసార్లు నిరూపించుకొన్నారని, ట్రంప్ వ్యాఖ్యలను ఒక్కసారి కూడా మోడీ ఖండించే సాహసం చెయ్యకుండా.. దేశ ప్రజల ప్రయోజనాలు దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. ట్రంప్ ఎన్ని సుంకాలు పెంచిన ఏం చేసినా, ఎంతగాభారత్ దేశన్ని అవమానిస్తున్న పట్టించుకోకుండా శుభాకాంక్షల మెసేజీలు పంపుతూనే ఉన్నారు. ఆర్థికమంత్రి అమెరికా పర్యటనను రద్దు చేశారు. ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందం కార్యక్రమానికి ప్రధాని వెళ్లలేదు.’ అంటూ పోస్టు లో దెప్పి పొడిచారు.
