సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్ : తాజాగా అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో పోర్న్‌ స్టార్‌ స్ట్రామీ డేనియల్స్‌తో నెరిపిన వ్యవహారం తాజగా బయటకు వచ్చిన కారణంగా అరెస్ట్ కావడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత బెయిల్ ఫై విడుదలై ఫ్లోరిడాలోని తన నివాసం మార్ ఏ లాగోకి చేరుకుని తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై మోపిన అభియోగాల్లో తాను దోషిని కాదని, తనపై మోపిన ఆరోపణలను కుట్ర పూరితంగా భావించి వాటిని కొట్టివేయాలని కోర్టు ముందు విన్నవించినట్లు ట్రంప్ తెలిపారు. “మన దేశం నాశనమవుతోంది.. నరకానికి వెళ్తోంది.. ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ప్రపంచం మన దేశాన్ని చూసి నవ్వుకుంది. ఇది దేశానికే అవమానం. మనం మన దేశాన్ని రక్షించుకోవాలి. అమెరికాను నాశనం చేయాలనుకునేవారి నుంచి రక్షించేందుకు ప్రయత్నించడమే నేను చేసిన నేరమా?” అంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *