సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై 25శాతం సుంకాలు విధించడంతో ఆ సుంకాలు రేపు ఆగస్టు 1 నుండి ప్రారంభం అవుతాయని ప్రకటించడంతో ఆ ప్రభావం తీవ్ర స్థాయిలో భారత్ స్టాక్ మార్కెట్లపై పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు, గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. మార్కెట్ ప్రారంభమైన వెంటనే పెట్టుబడిదారులకు పెద్ద షాక్ తగిలింది. గత రెండు రోజులుగా లాభాల్లో నడుస్తున్న స్టాక్స్ ఒక్క దెబ్బకు నష్టాల బాట పట్టాయి. మొదటి 15 నిమిషాలలోనే 5 లక్షల కోట్లు ఆవిరి అయ్యాయని నిపుణులు అంటున్నారు. నేటి . ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 535 పాయింట్ల నష్టంతో 80,946 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 157 పాయింట్లు క్షీణించి 24,696 వద్ద ఉంది.అయితే లాభాలలో ఎటర్నల్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, HUL, ITC స్టాక్‌లు అప్‌ట్రెండ్‌లో ఉన్నాయి. , డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.66 వద్ద ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *