సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల కాలంలో ట్రంప్ వివిధ దేశాలపై విధించిన సుంకాలు చెల్లవు అంటూ తీర్పు ఇవ్వడంతో , ట్రంప్ ప్రభుత్వానికి తాజాగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీం తీర్పు అమెరికా ను నష్టపరుస్తుందని ట్రంప్ మండి పడ్డారు.అయితే, గతంలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలపై కేవలం 10 శాతం సుంకం అమలవుతుందని శ్వేత సౌధం తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ కూడా ప్రస్తుతం ఉన్న 17 శాతం సుంకం కూడా 10 శాతానికి తగ్గవచ్చు. అయితే సుప్రీం కోర్టు తీర్పు అనంతరం వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాల ప్రకారమే సుంకాల విధించే మార్గాల కోసం ట్రంప్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.సుప్రీం కోర్టు తీర్పు తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కూడా స్పందించారు. డీల్ కొనసాగుతుందని అన్నారు. ( అంటే 17 శాతం కట్టవలసిందేనా? లేక వైట్ హౌస్ చెప్పినట్లు 10 శాతం సరిపోతుందా? క్లిరిటి రావాల్సి ఉంది.)భారత్‌యే ఆ సుంకాలను చెల్లిస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *