సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో దూకుడు నిర్ణయాలతో భారత్ ఇతర దేశాలతో పాటు స్వదేశం అమెరికాలో సైతం ప్రజలను కష్టాల పాలు చేస్తున్న ప్రసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌కు(trump) అమెరికా లో ప్రజల నుండి తాజగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అవి కూడా అల్లాటప్పాగా కాదు.. దేశంలోని 50 రాష్ట్రాల్లో సుమారు 2500 ప్రాంతాలలో లక్షలాది మంది ప్రజలు రోడ్లపై కి వచ్చి భారీ ర్యాలీలతో ‘నో కింగ్స్’ (NO KINGS) నినాదంతో ఆందోళనకారుటి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారులు మాకు’ నియంతృత్వ రాజుల తరహా పాలనా వద్దు’.. “నిరసనకు మించిన దేశభక్తి లేదు” అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ, “ఫాసిజాన్ని ప్రతిఘటించండి” అంటూ నినాదాలు చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ అనంతరం ట్రంప్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న మూడో భారీ ప్రదర్శన ఇది. ఈ నిరసనలు తీవ్రతరం అవుతుండగా, రిపబ్లికన్ పార్టీ ఈ ట్రంప్ వ్యతిరేక ర్యాలీలను తిప్పికొట్టింది. ఈ ఆందోళనలు అమెరికాపై విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలని రిపబ్లికన్ పార్టీ ఆరోపించింది. అయితే అమెరికాలో పెరిగిపోతున్న ధరలు, లక్షలాది ఉద్యోగులకు జీతాలు అందకపోవడం అన్ని వర్గాల ప్రజలలో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *