సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రష్యా తో భారత్ స్నేహాన్ని విడదీయాలయ్యని ఎన్నో పన్నాగాలు పన్నుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (TRUMP) భారత్‌పై ప్రస్తుతం 50 శాతం టారీఫ్‌లు కొనసాగితున్నారు. ఈ టారీఫ్‌ల కారణంగా భారత్ ఎగుమతి దారులకు అటు అమెరికాలో ధరలు పెరిగి వినియోగ దారులకు ఇద్దరికీ నష్టమే అయిన కూడా ట్రంప్ మొండిగా అమలు చేస్తున్నారు. ఈ సారి ఏకంగా అమెరికా దిగుమతి చేసుకుంటున్న బియ్యాన్ని ఆయన టార్గెట్ చేశారు. స్థానిక రైతులకు మేలు చేయటం కోసం భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంపై భారీ మొత్తంలో టారీఫ్‌లు విధించాలని ట్రంప్ డిసైడ్ అయ్యారు. ఈ విషయంలో ట్రంప్‌కు బిగ్ షాక్ తలిగింది. భారత్‌పై విధించిన 50 శాతం టారీఫ్‌లను రద్దు చేయాలంటూ, ట్రంప్ చర్యలు చట్ట విరుద్ధమని ముగ్గురు ప్రజా ప్రతినిధులు అమెరికా ప్రతినిధుల సభలో తాజగా తీర్మానం ప్రవేశ పెట్టారు. డెబోరా రాస్, మార్క్ వీసే, రాజా క్రిష్ణమూర్తిలు అధ్యక్షుడు ట్రంప్ జాతీయ అత్యవసర ప్రకటనను రద్దు చేసే లక్ష్యంతో ఆ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. 2025, ఆగస్టు 27వ తేదీన ట్రంప్ ప్రభుత్వం భారత్ ఫై అదనంగా 25 శాతం టారీఫ్‌లు వేసిన సంగతి తెలిసిందే. (up file photo)
