సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ భారత్ ను ఇటీవల కొట్టిన దెబ్బలు మామూలువి కావు. పైకి మోడీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ భారత్ ఫై తన వింత చేష్టలతో రోజుకో రకంగా గిల్లడం మాత్రం మానడం లేదు. భారత రూపాయి దారుణంగా నష్టపోయి డాలర్ ధర భారీగా పెరిగిపోయింది.(సుమారు 1 డాలర్ విలువ 90 రూపాయలకు చేరుకొంటుంది) ఇక్కడి ఎగుమతి దారులతో పాటు ప్రవాస భారతీయులుకు ఆదాయాలు తగ్గిపోయాయి. చైనా తరహాలో భారత్ ఎదురుదాడికి దిగకపోవడమే దీనికి కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు. సుంకాలుపెంపుతో ఇప్పటికే భారత ఎగుమతులను దెబ్బకొట్టిన ట్రంప్.. తాజాగా అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు గట్టి దెబ్బ కొట్టారు. హెచ్1బీ వీసా దరఖాస్తు వార్షిక రుసుమును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై తాజగా సంతకం చేశారు. ఇకపై అమెరికా కేంద్రం గా పని చేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవాలంటే ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాలి. అమెరికాలో హెచ్1బీ వీసాపై పని చేస్తున్న విదేశీ ఉద్యోగుల్లో దాదాపు 71 శాతం మంది భారతీయులే ఉంటారు. చైనీయులు 11.7 శాతం మంది ఉంటారు. ఫీజును భారీగా పెంచేయడంతో భారతీయులను చేర్చుకోవాలంటే అమెరికా కంపెనీలు అదనపు భారాన్ని మోయవలసిందే..
