సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా వంటి అగ్రరాజ్యానికి అధినేత అయిన ట్రంప్‌కు, రష్యాతో యుద్ధాన్ని ఎదుర్కొంటున్న జెలెన్‌స్కీ మధ్య ముఖాముఖీ చర్చలలో చోటుచేసుకున్న గొడవ, ఒకరినొకరు తిట్టుకున్నా తిట్లు .. ప్రపంచం మొత్తాన్నీ నివ్వెరపోయేలా చేసింది. కష్టాలలో ఉన్న ఉకెయిన్ కు యుద్ధ సాయం పేరుతొ ఆ దేశంలో విలువైన మెటల్ గనులు, గ్యాస్ నిక్షేపాలు ఫై హక్కులు అమెరికా కు కట్టబెట్టాలని ట్రంప్ చేసిన డిమాండ్ ను, ఆ ఒప్పందపత్రాలను జెలెన్‌స్కీ ఒక్కమాటలో త్రోసిపుచ్చారు. దానితో ట్రంప్ అసహనంతో రగిలిపోతూ అమెరికా సాయం చెయ్యకపోతే ఉక్రెయిన్ ను రష్యా 14 రోజులలో గెలిచేది అని.. అసలు మీకు విశ్వాసం లేదని ప్రెస్ ముందే దుమ్మెత్తి పోశారు ట్రంప్..జెలెన్‌స్కీ కూడా తగ్గేదే .. లే అంటూ..ట్రంప్ కి క్షమాపణలు చెప్పేది లేదని, అమెరికా ప్రజలకు కృతజ్ఞలు చెపుతాను తప్ప మీకు కాదు అంటూ ట్రంప్ కి తెగేసి చెప్పారు.. ( పుష్ప సినిమా లో షెకావత్ కు క్షమాపణ చెప్పించే సన్నివేశానికి ఏ మాత్రం తగ్గలేదు.. ) తాజాగా, వీరి మధ్య జరిగిన వివాదంపై రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా స్పందించారు. దురుసుగా ప్రవర్తిన జెలెన్‌స్కీపై ట్రంప్ దాడి చేయకుండా సంయమనం పాటించడం అద్భుతమని చెప్పారు. జెలెన్‌స్కీ అన్నం పెట్టిన చేతినే నరుతున్నారంటూ మండిపడ్డారు.అమెరికా పట్ల అమర్యాదగా వ్యవహరించిన ఉక్రెయిన్‌కు ఈ పరిణామాలు చెంపదెబ్బ వంటివని అన్నారు. అయితే విచిత్రంగా ఫ్రాన్స్, కెనడా వంటి దేశాధినేతలు అమెరికా తీరును తప్పపట్టాయి. ఉక్రెయిన్‌కు తామంతా అండగా ఉన్నామని తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *