సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా అధ్యక్షడు ట్రంప్ పదవి నుండి దిగిపొమ్మని ఆయనపై అభిశంసన తీర్మానం పెట్టాలని ఆయన మిత్రుడు ప్రపంచ కోటీశ్వరుడు, అంతరిక్ష శాస్త్రవేత్త ఎలాన్ మాస్క్ పేర్కొనడం చూసి ప్రపంచం షాక్ తింది. కాస్త లోతుగా చుస్తే.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 నవంబర్ లో జరిగాయి.ఆ ఎన్నికలలో ఎలాన్ మస్క్ ట్రంప్ గెలుపుకు అండగా బహిరంగంగా ప్రచారం కూడా చేశారు. నీళ్ళల్లా వేల కోట్ల డబ్బు కూడా ఖర్చు పెట్టారు. మొత్తానికి ట్రంప్ అధికారంలోకి వచ్చాక డోజ్ అనే విభాగాన్ని పెట్టి దానికి మాస్క్ ను అధిపతిగా నియమించారు. అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ తర్వాత మస్క్ అమెరికాలో రెండవ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అయ్యారు. అయితే 27జనవరి 2025 ఈరోజున యూరోపియన్ యూనియన్ పై 25 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. దీనిని ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. తన టెస్లా, ఎక్స్ కంపెనీలకు హానికరమని మస్క్ బహిరంగంగా అన్నారు. దీనితో తిక్క వచ్చిన ట్రంప్ ఆదేశాలతో 18 ఫిబ్రవరి 2025మస్క్ DOGE కి బాస్ కాదని, కేవలం సలహాదారుడని వైట్ హౌస్ స్పష్టంచేసింది. దీనిపై మస్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.6 మార్చి 2025 ట్రంప్ అన్ని దేశాలతో పాటూ మిత్ర దేశం భారతదేశంపై భారీ సుంకాలు వేశారు. దీనిని ఎలాన్ మస్క్ వ్యతిరేకించారు. ఇలా చేస్తే భారతదేశంతో వ్యాపారం చేయడం కష్టమని అన్నారు. భారతదేశంలో టెస్లా ఫ్యాక్టరీని నిర్మించి స్టార్‌లింక్‌ను ప్రారంభించాలని మాస్క్ సిద్దపడుతున్నారు. అలాగే ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ను చాలా ఖరీదైనదిగా, సెనేట్ లో మంత్రులందరూ అంగీకారం తెలపడం బుద్ధిలేని తనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక మే 29, 2025 మస్క్ రాజీనామా చేసారు. తన ప్రభుత్వ బాధ్యతల నుండి తప్పుకొని బయటకు వచ్చాక నేనే లేకపోతే ట్రంప్ గవర్నమెంట్ లేదని. మాస్క్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వీటికి ట్రంప్ ఆగ్రహం చెంది మాస్క్ కంపెనీలపై నిబంధనలు టాక్స్ లపై ద్రుష్టి సారించారు. దీనితో ఎలాన్ మాస్క్.. టెస్లా షేర్స్ విలువ 14 శాతం నష్టపోయాయి. అయితే ట్రంప్ ఫై తిరగబడ్డ ,మాస్క్ కు చెందిన స్టార్‌లింక్ ఇంటర్ నెట్ కంపెనీ కి భారత్ వెను వెంటనే పర్మిషన్ ఇచ్చింది. అలాగే మాస్క్ అమెరికాను వదిలేస్తే రష్యా తమ దేశం నికి ఆహ్వానించడం వంటి తాజా పరిణామాలు ట్రంప్ కి పెద్ద తలనొప్పిగా మారాయి.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్..
