సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్, చైనా ఇరు దేశాలపై అమెరికా అవలంబీస్తున్న ట్రేడ్ టారిఫ్స్ ను పుతిన్ నేడు, గురువారం తీవ్రంగా ఖండించారు. ఇటువంటి చర్యలు కాలం చెల్లిన వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు. చైనాలో తన నాలుగు రోజుల పర్యటన తర్వాత పుతిన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు 150 కోట్ల జనాభా కలిగిన అతి పెద్ద ప్రజానీకం ఉన్న భారతదేశం, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా వంటి దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఇలాంటి చర్యలు.. దీర్ఘకాలంగా ఉన్న ఆయా దేశాల సార్వభౌమాధికారంపై దాడులుగా భావించే అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు.ఉక్రెయిన్ యుద్ధాన్ని కేవలం ఓ సాకుగా చూపి టారీఫ్ లతో ట్రంప్ రెచ్చిపోతున్నారని అన్నారు. వలస రాజ్యాల యుగం ముగిసిందన్న పుతిన్.. భాగస్వాములతో జాగ్రత్తగా మాట్లాడాలని ట్రంప్ హెచ్చరించారు.
