సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ పాకిస్తాన్ ఫై దాడి చేసినప్పటి నుండి చాల విచిత్రంగా ప్రవర్తిస్తున్న అమెరికా అడ్జక్షుడు ట్రంప్ నిన్న ఖతార్ దేశంలోని దోహాలో ప్రపంచ వ్యాపార వేత్తలతో సమావేశం అయ్యాక, తదుపరి మీడియా ముందు మాట్లాడుతూ.. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌ తో భారతదేశంలో ఆపిల్ విస్తరణపై ప్రశ్నించినట్లు తెలిపారు. భారత్ మీకు అనుకూలంగా ఉండదు.. టాక్స్ లు ఎక్కువ ఉంటాయి. మన అమెరికాలోనే ఆపిల్ ఉత్పత్తులను ప్రోత్సహించండి అంటూ భారత్ అభివృద్ధి కి గండి కొట్టేస్తున్నట్లు పబ్లిక్ గా ట్రంప్ చెప్పేయడం అందరిని విస్మయ పరచింది. దీనిపై ఆపిల్ సంస్థ తాజగా స్వాందిస్తూ .. భారతదేశాన్ని ఒక ప్రధాన తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఆపిల్ ప్రణాళికల్లో ఎలాంటి మార్పులు ఉండవని, ఈ విషయాన్ని కంపెనీ స్పష్టంగా భారత ప్రభుత్వానికి తెలియజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అమెరికాలో ఉత్పత్తిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో, ట్రంప్ సూచించారని ట్రంప్ పేర్కొన్నారు.అయితే, ఈ వ్యాఖ్యలు వచ్చిన తర్వాత కూడా ఆపిల్ తన ప్రణాళికలపై వెనక్కి వెళ్లబోవడం లేదని తేల్చి చెప్పింది. భారత ప్రభుత్వానికి కంపెనీ ఇచ్చిన స్పష్టత ప్రకారం, 2025 మార్చి నాటికి దాదాపు 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లు భారతదేశంలో తయారు కానున్నాయి. అంటే, ప్రపంచంలో విక్రయించే ప్రతి ఐదు ఐఫోన్‌లలో ఒకటి భారత్‌లోనే ఉత్పత్తి అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *