సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా నేడు, శుక్రవారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల పలువురు ట్రోలర్స్ సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వ, హక్కులను ఉల్లంఘించేలా, అవమానకరంగా వ్యవహరిస్తున్నారని అంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.( ఇటీవల తెలంగాణ దిష్టి ..నేపథ్యంలో అక్కడి మంత్రులు, నేతలు పవన్ ను హెచ్చరించిన నేపథ్యంలో ఈ తరహా పోస్టులు మరి ఎక్కువ అయ్యాయి) ఆ పోస్టుల కారణంగా తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. వారం రోజుల్లో ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను సమర్పించాలని మెటా, గూగుల్, ఎక్స్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేసింది.
