సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత మైక్రో బ్లాగింగ్ సైట్ ,, ట్విటర్ సీఈవోగా, జాక్ డోర్సీ వైదొలిగిన విషయం తెలిసిందే. అతని స్థానంలో భారత్‌కు చెందిన పరాగ్ అగర్వాల్, ట్విటర్ కొత్త సీఈవోగా నియమితులయ్యారు. . ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ వేతన వివరాలను యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ)కి సమర్పించిన ఫైలింగ్‌లో ట్విట్టర్ తెలిపింది. 37 ఏళ్ల పరాగ్ అగర్వాల్ వార్షిక వేతనం ఒక మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 7.5 కోట్లు)గా ఉందని తెలుస్తోంది. నియంత్రిత స్టాక్ యూనిట్ల నుంచి సుమారు 12.5 మిలియన్ల డాలర్ల(దాదాపు రూ. 93.9 కోట్లు)ను పరాగ్ పొందుతారు. వీటితోపాటుగా ట్విటర్ అందించే అన్ని బోనస్‌లను, ప్రయోజనాలను పొందేందుకు పరాగ్ అర్హత ఉంటుంది.
