సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నన్ను చంద్రబాబు కు ప్యాకేజి స్టార్ అనే వెదవలును ఇంటికొచ్చి చెప్పుతో కొడతా! అంటూ ఈ రోజు ఎవరు ఊహించని రీతిలో వైసిపి నేతలపై బూతులతో చెలరేగిన పవన్ కళ్యాణ్ ను ఎవరు ఊహించని రీతిలో విజయవాడలో టీడీపీ అధినేత, చంద్రబాబు స్వయంగా వచ్చి కలవడం మరో పెద్ద ట్విస్టుగా మారింది. 2 గంటల పైగా జరిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది.ఈ సందర్భంగా జనసేన, టీడీపీ ఉమ్మడిగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ పర్యటించకుండా అడ్డుకోవాలనే వైసిపి ప్రభుత్వ విధానం,జనసేన నేతలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. పవన్‌కు సానుభూతి, సంఘీభావం తెలిపేందుకు వచ్చానని చంద్రబాబు తెలిపారు. పవన్ విశాఖ వదిలి వెళ్లేవరకు ఆంక్షలు పెట్టారని పేర్కొన్నారు. పవన్ వెళ్లే దారిలో లైట్లు కూడా తొలగించడం దారుణమన్నారు. విశాఖలో పోలీసులు దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్ర జాస్వామ్య గొంతు నొక్కేందుకు వైసిపి సర్కార్ ప్రయత్నిస్తుందన్నారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ బారి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని తాను యుద్ధం మొదలు పెట్టానని అందుకు లెఫ్ట్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకొనిపోతామని, అయితే ఇప్పుడు ఎన్నికల పొత్తులు కావని కేవలం రాష్ట్ర ప్రబుత్వంపై పోరాటం మాత్రమేనని పవన్ తెలిపారు.
