సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నా పుష్ప 2 సినిమా ఆగస్టు 15న రిలీజ్ ప్రకటించారు. అయితే వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ డేట్ కోసం పలు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఆగస్టు 29న ఇప్పటికే డేట్ సెట్ చేసుకున్న నాని ‘సరిపోదా శనివారం’ సినిమా కాస్త ముందుగా ఆగస్టు 15 రిలీజ్ చెయ్యాలని చుస్తునారు. అయితే ఇపుడు పూరి జగన్నాధ్, రామ్ కాంబినేషన్స్ లో ‘డబుల్ ఇస్మార్ట్ ‘కూడా అదే డేట్ కి బరిలోకి దిగుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది కూడా. తమ భారీ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నారు. ఈరోజు సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ను రిలీజ్ చేశారు. దాని ప్రకారం డబుల్ ISMART ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున సినిమా థియేటర్లలోకి రానుంది. ఇక సినిమా విడుదలకు స్వాతంత్ర్య దినోత్సవం సరైన సమయం అని భావిస్తున్నారు. గురువారం సెలవు కాగా, సోమవారం (రక్షాబంధన్) మరో సెలవుదినాన్ని కూడా సినిమా క్యాష్ చేసుకునేందుకు సిద్ధం అయింది. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. రామ్ సరసన కావ్య థాపర్ కథానాయికగా అందిస్తుండగా మణిశర్మ సంగీతం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక డబుల్ ISMART తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో విడుదల చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *