సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని జిల్లా కలెక్టరేట్ లో పశ్చిమ గోదావరి జిల్లా మునిసిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తో కలెక్టర్ సి.నాగరాణి సమావేశంలో మాట్లాడుతూ.. ఈ వర్ష కాలంలో సీజనల్ గా వచ్చే వ్యాధుల నుండి అనారోగ్యాల నుండి ప్రజలు రక్షణ పొందేందుకు విస్తృత పారిశుధ్య కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం సీజన్లో డయేరియా, డెంగ్యూ, జ్వరాలు జిల్లాలో ప్రబలుతున్నాయని అపరిశుభ్రత, నీటి కలుషితం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సీజనల్ వ్యా ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇక మునిసిపల్ శానిటరీ అధికారులు అలర్ట్ గా ఉండాలని, వీధుల్లో, షాపుల ముందు, డ్రైనేజీల్లో చెత్త వేయకుండా నిర్దేశింర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే చెత్త వేసేలా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. .దోమల నివారణకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా అందించిన ఫాగింగ్ మిషన్లు, తదితర పనిముట్లనుట్ల వినియోగించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మున్సిపాలిటీల వారీగా పారిశుధ్య కార్యక్రమాలపై ఆయా మున్సిపల్ కమిషనర్లు ఇప్పటి వరకు తీసుకొన్న చర్యలు ను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్, ప్రవీణ్ ఆదిత్య, మున్సిపల్ అడ్మినిస్ట్రే షస్ట్రే న్ రీజనల్ డైరెక్టర్, సీహెచ్ నరసింహరాజు, పబ్లిక్బ్లి హెల్త్ ఎస్ఈ ఏ.సుధాకర్, భీమవరం మున్సిపల్ కమిషనర్ శ్యామల ఇతర అధికారులు పాల్గొన్నారు.
