సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: భీమవరం మండలం తాడేరు గ్రామంలో 17 లక్షల 50 వేల రూపాయలతో నూతనంగా నిర్మాణం చేసిన డాక్టర్ వై.యస్.ఆర్ విలేజ్ క్లినిక్ భవనాన్ని నేడు, శనివారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తి తో సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యం పట్ల చూపిస్తున్న శ్రద్ధ, ఏర్పాటు చేసిన పధకాలు దేశంలో మరెక్కడ ప్రజలకు లేవని అన్నారు. ఇప్పటికే ప్రజల ఆరోగ్య రక్షణ కోసం కార్పొరేట్ హాస్పటల్స్ లో సైతం ఉచితంగా వైద్యం చేయించే ఆరోగ్యశ్రీ తో పాటు , 108, 104, తదితర వాహనాల సేవలు ప్రజలు మన్ననలు పొందుతున్నప్పటికీ వైద్య సేవలు ప్రజలకు వాడవాడలా అందుబాటులోకి తీసుకొని రావడంలో భాగంగా గ్రామాలలో విలేజ్ క్లినిక్ లు ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెస్తుందని, అందులో బాగంగా తాడేరు గ్రామము లో ప్రజల ఆరోగ్యం కోసం డాక్టర్ వై.యస్.ఆర్ విలేజ్ క్లినిక్ భవనాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించడం తనకెంతో ఆనందముగా ఉందని, స్తానిక ప్రజలు ఈ ఉచిత ఆరోగ్య సేవలను వాడుకొని ఆరోగ్యంగా ఉండాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వెంకట నరసింహరాజుతో పాటు వైద్య సిబ్బంది, వైసిపి పార్టీనేతలు, ప్రజలు పాల్గొన్నారు.
