సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పొందిన వారు..బ్యాంకింగ్ రంగంలో కెరీర్ సెట్ చేసుకుందాం అనుకునేవారికి ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ గుడ్ న్యూస్ చెప్పింది. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టు కోసం IBPS క్లర్క్ పరీక్షను నిర్వహించనుంది. ఈమేరకు అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 11 పీఎస్బీలలో మొత్తం 10277 ఖాళీలను భర్తీ చేయనున్నారు. రూ.24 వేల జీతం ఆఫర్ చేస్తున్నారు. దీని దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు కొనసాగనుంది. కాబట్టి, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.ibps.in. ద్వారా అప్లై చేసుకోవచ్చు. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ సెప్టెంబర్ లో ఉంటుంది. అడ్మిట్ కార్డ్స్ సెప్టెంబర్ లో ఉంటుంది. అక్టోబర్ 4, 5, 11వ తేదీన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది . నవంబర్ 29న మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది.
