సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ లతో కలిసి భీమవరం ఎమ్మెల్యే, పులపర్తి రామాంజనేయులు, తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు లు కల్సి దేవాలయంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ రూ 3.5 కోట్ల దేవాదాయ శాఖ నిధులతో ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న ప్రదక్షణ మండపానికి, రూ. 3.7 కోట్ల పంచాయతీ రాజ్ రోడ్ అసెట్స్ నిధులతో ఐఎస్ జగన్నాథపురం గ్రామం నుంచి ఆలయానికి వెళ్లేందుకు నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసి, శిలా ఫలకాలు ఆవిష్కరించారు.
