సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం ఏ టివి ఛానెల్ చుసిన ఏపీ ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ ని చెయ్యాలని టీడీపీ కీలక నేతలు చేస్తున్న ప్రకటనలపై జనసేన నేతలు కౌంటర్ లు ఎన్కౌంటర్ తో చర్చ వేదికలు వేడెక్కిపోతున్నాయి. ఇటీవల బహిరంగం గానే టీడీపీ నేతలు చంద్రబాబు ను లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనీ కోరటం..దానికి ఆయన ఖండన ఇవ్వక పోవడం తదుపరి కొందరు కీలక మంత్రులు సైతం .. లోకేష్ పాదయాత్ర వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని .. లోకేష్ కు నుదిటిపై రాసి ఉంటె ఆ పదవి రావడం ఎవరు ఆపలేరని కామెంట్స్ జోష్ పెంచడం దానికి ప్రతిగా జనసేన కీలక నేతలు సైతం మరేం పర్వాలేదు.. పవన్ ను సీఎం చేసి లోకేష్ ఆ పదవి తీసుకొంటే అభ్యన్తరం లేదని ఎత్తి పొడవడం తో టీడీపీ , జనసేన మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో ( కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ..?) విదేశాలలో ఉన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ హైకమాండ్ ఈ అంశంపై నాయకులేవరూ మాట్లాడవద్దని ఆదేశించింది. దీంతో నేటి మంగళవారం నుండి జనసేన నాయకులు డిప్యూటీ సీఎం అంశంపై ఎలాంటి బహిరంగ కామెంట్స్ చేయవద్దని శ్రేణులకు జనసేన అధిష్టానం ఆదేశాలు జారీచేసింది. ఎవరైనా హైకమాండ్ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. అయినప్పటికీ ఇరుపార్టీల అభిమానులు సోషల్ మీడియాలో పోటాపోటీగా పోస్టులు పెడుతున్నారు.
