సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా డిసిఎంఎస్ అధ్వర్యంలో భీమవరం లో నేడు, ఆదివారం ఏర్పాటు చేసిన దీపావళి బాణా సంచా దుకాణాన్ని స్థానిక ఎమ్మేల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. దీపావళికి నాణ్యమైన బాణాసంచా సరుకు ప్రముఖ బ్రాండ్ లకు చెందినది నిజమైన హోల్ సెల్ ధరలకు అందివ్వాలని డిసిఎంఎస్ ప్రజా ప్రయోజనార్ధం ఈ విధంగా బాణాసంచా వ్యాపారం చెయ్యడం హర్షణీయం అని అభినందించారు. ఈకార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ వెండ్ర వెంకట స్వామి కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ పివి ఎల్ నరసింహరాజు, ఎంపిపి పేరిచర్ల విజయ నరసింహరాజు, వైసిపి జిల్లా మహిళా అడ్జక్షురాలు గూడూరి ఉమాబాల,ఏఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *