సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా, దర్శన టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల కు సంబంధించి కోటాను టికెట్స్ అమ్మకాలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి. నేడు, బుధవారం సెప్టెంబరు 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఇక ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబరు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబరు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను సెప్టెంబరు 21వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. సెప్టెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు.. అంగప్రదక్షిణం టోకెన్లు..ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. సెప్టెంబరు 23న‌ శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా.ను ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వృద్ధులు, దివ్యాంగుల ఉచిత ప్రత్యేక దర్శన టికెట్స్ ను సెప్టెంబరు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుదల చేస్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబరు 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తరు. . అదేరోజు తిరుమల, తిరుపతిల‌లో డిసెంబరు నెల గదుల కోటాను సెప్టెంబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.సెప్టెంబరు 27న డిసెంబరు నెల తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *