సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తాజగా విడుదల చేసిన రిజర్వ్ బ్యాంకు డేటా ప్రకారం డిసెంబర్ నెలలో బ్యాంకులు 13 రోజుల పాటు సెలవులు ఉంటాయి. బ్యాంకుల ఖాతాదారులు వచ్చే నెల డిసెంబర్లో వచ్చే రెండు, నాలుగు శనివారాలు 4 ఆదివారాలతో పాటు సెలవుల జాబితాను ఒకసారి చెక్ చేసుకొని దాని కనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. డిసెంబర్లో 3,4,10,11,18,24,25 తేదీల్లో దేశవ్యాప్త సెలవులు. అలాగే డిసెంబర్ 24న, క్రిస్మస్, నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే ఇంటర్నెట్ అనుసంధాన బ్యాంకింగ్ , యూపీఐ సేవలు యథావిధిగా అందుబాటులో కొనసాగుతాయి.
