సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ, వైసిపి లో రెబల్, రఘురామా కృష్ణంరాజు ఢిల్లీలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా నేడు, శుక్రవారం మీడియా వారితో మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే తెలంగాణతో పాటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయన మనసు మారకపోతే, డిసెంబర్ లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఖాయమని ఎంపీ, రఘురామకృష్ణంరాజు తెలిపారు. గత ఎన్నికల్లో తమ పార్టీ అప్రహతిత విజయానికి కారణమైన కోడి కత్తి కేసు తో పాటు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తమ పార్టీ పెద్దలు ఆడించిన డ్రామా నేనని తేలితే, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితి ఏమిటన్నది అంతు చిక్కడం లేదన్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల ప్రజా ప్రతినిధుల, నాయకుల పరిస్థితి ఏమిటన్నది అంతుచిక్కడం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *