సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం తో పొత్తు పెట్టుకొన్న జనసేన కు కేటాయించే సీట్లు వచ్చే జనవరిలో ప్రకటిస్తారని భావిస్తున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మరో 2 రోజులలో అంటే వచ్చే డిసెంబర్ 1వ తేదీన జనసేన విస్తృత స్థాయి సమావేశం మధ్యాహ్నం 3 గంటల నుండి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొననున్నారు. పార్టీ పీఏసీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జిలు , వీర మహిళా విభాగం, అధికార ప్రతినిధులకు ఇప్పటికే ఆహ్వానం అందింది. ఏపీలో టీడీపీ తో జనసేన సమన్వయ కమిటీల చర్చల వివరాలు, వివిధ ప్రాంతాలలో జరిగిన ఘర్షణ వాతావరణం కూడా చర్చకు రానున్నాయి. ఈ కార్యక్రమానికి భీమవరం నుండి పార్టీ పీఏసీ సభ్యులు కనకరాజు సూరి, మల్లినేడి బాబీ మరియు టీడీపీ తో పొత్తులో జనసేన సమన్వయ కమిటీ సభ్యులు , ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్జక్షులు కొటికలపూడి గోవిందరావు పాల్గొననున్నారు.
