సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఐకాన్ స్టార్, అల్లు అర్జున్, సూపర్ టాలెంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో ఆర్య, ఆర్యా 2 తరువాత వస్తున్న మూడో చిత్రం ‘పుష్ప1’. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ప్రేక్షకుల్ని సైతం అలరించడానికి రెడీ అయిపోయింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. నిన్న (ఆదివారం) ‘పుష్ప’ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్.. రాజమౌళి, కొరటాల శివ ఇంకా ఇతర ముఖ్యులు ఈ వేడకకు హాజరయ్యారు. ఇక ఇందులో ‘మంగళం శ్రీను’ అనే వెరైటీ గెటప్ లో విలన్ పాత్రను పోషించిన భీమవరం బుల్లోడు’ సునీల్ ‘ మాట్లాడుతూ.. ‘నేను అల వైకుంఠపురములో’ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ఇది పెళ్ళిభోజనం లాంటి సినిమా అవుతుందని చెప్పాను. అలాగే జరిగింది. ఇప్పుడు ‘పుష్ప’ సినిమా విషయంలో కూడా చెబుతున్నాను. ఇది పెళ్ళి తర్వాత జరిగే రిసెప్షన్ లాంటిది. అందులో కక్కా ముక్కా దొరుకుతాయి. ఎవరు ఎంతతినాలో అంత తినేయొచ్చు. అలా ఉంటుంది ఈ సినిమా. తెలుగులో చాలా మంది డైరెక్ట్ గా విలన్స్ అయిపోతున్నారు. నేను మాత్రం ఓ పది సినిమాల్లో హీరోగా చేసి, సిక్స్ ప్యాక్ చేసి ఆ తర్వాత విలన్ గా వస్తున్నాను. అభిమానులకు ముందే చెబుతున్నాను. ఈ సినిమాలో నేను నవ్వించను. కొంచెం భయపెడతాను. అయినా సరే నా కోసం మీరు ఆ పాత్రను యాక్సెప్ట్ చేయండి. మిగతాభాషలో పర్వాలేదు. వాళ్ళకి నేను కొత్త. కాబట్టి.. నన్ను విలన్ గా చూసినా ఫీలవ్వరు. ఇక ఇందులో బన్నీ పాత్ర గురించి చెప్పాలంటే.. అప్పుడే మా అబ్బాయి బన్నీలా నడుస్తూ యాక్ట్ చేస్తున్నాడు. అలా చేయాలంటే గెడ్డముండాలి రా.. అప్పుడు ‘తగ్గేదేలే’ అంటే పెర్ఫెక్ట్ గా ఉంటుందని నేను చెప్పాను. సుకుమార్ కి, బన్నీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను’ అని సునీల్ అన్నారు.
