సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 .. క్రేజ్ మాములుగా లేదు.. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప2: ది రూల్‌’ (Pushpa 2) సినిమా డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అనుమతి ఇచ్చింది. ఒకరోజు ముందుగానే డిసెంబర్‌ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్‌ షోతోపాటు, అర్థరాత్రి 1 గంట మరియు తెల్లవారు జాము 4 గంటల షోలకు కూడా అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్‌ ధరను అదనంగా రూ.800 పెంచింది. ఈ షో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్‌ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సి ఉంటుంది.. ఈ పెంపుతో సింగిల్‌ స్క్రీన్ లో టికెట్‌ ధర సుమారు రూ.1000 అవుతుండగా, మల్టీప్లెక్స్‌లో రూ.1200లకు పైగా అవుతోంది.. డిసెంబర్‌ 5 నుంచి 8 వరకు సింగిల్‌ స్క్రీన్ లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. డిసెంబర్‌ 9 నుంచి 16 వరకు సింగిల్‌ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంచడానికి అనుమతి ఇచ్చారు. మరి ఏపీలో చంద్రబాబు సర్కార్ పుష్ప కు రేట్ల పెంపు ఫై ఎటువంటి అనుమతి ఇస్తుందో చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *