సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విక్టరీ వెంకటేశ్ హీరోగా నటవిశ్వరూపం చూపించిన సురేష్ ప్రొడక్షన్స్ రూపొందిన చిత్రం ‘నారప్ప ‘ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ మూవీ కరోనా పరిస్థితుల నేపథ్యం లో ఓటీటీలో విడుదలై భారీ హిట్ ని అందుకుంది. అపట్లో దక్షిణాదిన ఓటిటి లో అతిపెద్ద ఘన విజయంగా నమోదు అయ్యింది. థియేటర్స్ లో వచ్చి ఉంటె ఆ సౌండ్ సిస్టంకు సంచలాన విజయం నమోదు అయ్యిఉండేది. అయితే ‘నారప్ప’ ని బిగ్ స్క్రీ న్ పైచూడాలని ఆశపడ్డ అభిమానులు కోసం విక్టరీ వెంకటేశ్ బర్త్ డే కానుకగా డిసెంబర్13న ‘నారప్ప’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నా రు. ఈ నేపథ్యంలో తాజాగా నేడు, శనివారం నిర్మా త సురేష్ బాబు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. అమెజాన్ వారి అనుమతితో ఒక్క రోజు మాత్రమే నారప్ప థియేటర్స్ లో ప్రదర్శి తమవుతుంది. రీరిలీజ్ ద్వారా వచ్చే కలెక్షన్లలో ఒక్క పైసా కూడా తాము తీసుకోబోమని, ఎంత రెవెన్యూ వచ్చిన అదంతా చారిటీకి అందచేస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *