సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా, ముఖ్య కేంద్రమైన భీమవరం పట్టణంలో గత 20 సంవత్సరములుగా వైద్య సేవలందిస్తున్న భీమవరం హాస్పిటల్స్ వైద్య సేవల రంగంతో పాటు వైద్య విద్యా రంగంలోనికి ప్రవేశించింది.భారత ప్రభుత్వ అధీకృత అత్యున్నత వైద్య విద్యా నిర్వహణ సంస్థ అయిన నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్, డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డు (డి.ఎన్.బి) పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల నిర్వహణకు భీమవరం హాస్పిటల్స్ కు ప్రత్యేక గుర్తింపు నిచ్చింది. ఈ నేపథ్యంలో నేడు, శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. కే.వీ.కృష్ణంరాజు హర్షం వ్యక్తం చేస్తూ.. తమ భీమవరం హాస్పటల్స్ లో సువిశాల ప్రాంగణంలో 200 పడకలతో వైద్యశాలను ప్రారంభించామని అన్ని రకముల స్పెషాలిటీ మరియు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్నామని ఇప్పుడు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ గుర్తింపుతో ఎం.బి.బి.ఎస్ తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్య విద్యా కార్యక్రమాలను పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్ట మొదటి సారిగా ప్రారంభిస్తున్నామని, త్వరలో రేడియాలజీ మరియు ఇతర స్పెషాలిటీ వైద్య విభాగాలలో సీట్లు అందుబాటులోనికి రానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం హాస్పటల్స్ చైర్మన్ డాక్టర్. గోపాలరాజు మరియు డాక్టర్. ఆర్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక గుర్తింపు సాధించిన భీమవరం హాస్పటల్స్ కు సిగ్మా న్యూస్ శుభాబినందనలు తెలుపుతున్నాము.
