సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ కార్యాలయంలో నేడు, శుక్రవారం ది 04-04-2025 తేదీ ఉదయం 10 గంటలకు ఫెర్టిలైజర్స్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు వార్షిక సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు గాదిరాజు విశ్వనాథరాజు అధ్యక్షతన 2025 2027 సంవత్సరములకు నూతన కార్యవర్గమును కోసం ఏకగ్రీవ ఎన్నిక జరిగింది.నూతన అధ్యక్షులుగా బొండావెంకట సత్య శ్రీరామ హనుమంతరావు, ఉపాధ్యక్షులుగా చవ్వా శ్రీనివాస సుబ్బారావు, కార్యదర్శిగా కూర్మదాసు సత్య శ్రీనివాస్ (వాసు), సహాయ కార్యదర్శిగా మీసాల భాస్కరరావు, కోశాధికారిగా సోము శేషారావు గార్లు ఎన్నికైనారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యనిర్వాహక వర్గ సభ్యునిగా శ్రీకూర్మదాసు సత్య శ్రీనివాసు (వాసు) ని ఏకగ్రీవంగా తీర్మానించి నిర్ణయించడమైనది.
