సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ..తమిళనాడు సీఎం స్టాలిన్ నేడు, శనివారం దక్షిణాది ప్రధాన పార్టీల నేతలను సీఎంలను ఆహ్వానించిన నేపథ్యంలో ..ఆ సమావేశానికి తనకు ఆహ్వానం అందినప్పటికీ వేళ్ళని ఏపీ మాజీ సీఎం సీఎం జగన్ ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ‍ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్‌ జగన్‌ తాజగా ఓ లేఖ రాశారు. వచ్చే ఏడాది(2026) జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని..‘‘గత 15 ఏళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా ఉత్తరాది తో పోల్చుకొంటే బాగా తగ్గింది. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్‌ (Delimitation) ప్రక్రియ గనుక చేపడితే.. దక్షిణ భారత దేశంలో తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తోంది. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా ఇక్కడి సీట్ల సంఖ్యా తగ్గకుండా చూడండి.. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా. అటు లోక్‌సభ ఇటు రాజ్యసభలో.. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని కేంద్రాన్ని కోరుకుంటున్నా’’ అని ప్రధాని మోదీని కోరారు. జగన్ ట్విస్ట్ ఏమిటంటే.. ఒక రకంగా ఇటు తన ఆగర్భ శత్రువు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సమావేశానికి వెళ్లకుండా అటు ఎన్డీయే నిర్ణయాలకు భజన చెయ్యకుండా జగన్ గడసరి గా ఈ సమస్యపై సాక్షాత్తు మోడీనే ప్రశ్నించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *