సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ కి దూరమైన అగ్రనేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తనకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నేడు, బుధవారం మంగళగిరి సీఐడీ పోలీసులు విచారణకు హాజరు అయ్యారు. కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ చైర్మెన్ కేవీ రావు నుంచి అక్రమంగా కంపెనీ వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.. ఉదయం 11 నుంచి దాదాపు 3:30 గంటలపాటు సాయిరెడ్డిపై అధికారులు విచారించారు. విచారణ అనంతరం సాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. “కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా సీఐడీ అధికారులు నన్ను ప్రశ్నించారు. రాజకీయ బ్రోకర్ కేవీ రావు. అతనంటే నాకు అసహ్యం. కేవీ రావు తో తనకు . ముఖ పరిచయం, అలాగే ఏదైనా సోషల్ ఫంక్షన్లలో నమస్కారం అంటే నమస్కారం అని చెప్పడం తప్ప.. అతనికి, నాకూ ఏ విధమైన సంబంధాలు లేవని చెప్పాను అరబిందో సంస్థ నుంచి కేవీ రావుకు దాదాపు రూ.500 కోట్లు బదిలీ అయిన విషయం నాకు సంబంధం లేదని, అసలు నిధులు బదిలీ అయిన సంగతి కూడా తెలియదని తెలిపాను. వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి తోకలసి జగన్ మోహన్ రెడ్డిని కాపాడేందుకే మీరు, నగదు బదిలీ చేశారా? అని ప్రశ్నించారు. ఈ డీల్ విషయం అసలు జగన్‍కు తెలియదని చెప్పా. అలాగే నాకూ ఎలాంటి సంబంధం లేదని సీఐడీ అధికారులకు మరోసారి స్పష్టం చేశా. నన్ను ఉద్దేశ పూర్వకంగానే ఒక ప్రభుత్వ అధికారి ఈ కేసులో ఇరికించారు. గతంలో ఏ-2గా ఉన్నా కాబట్టి ఈ కేసులోనూ ఏ-2గా చేర్చారు. జగన్ మోహన్ రెడ్డికి నాకూ మధ్య ద్వితీయశ్రేణి నాయకులు దూరం పెంచిన మాట వాస్తవం. దీంతో నా మనసు విరిగిపోయింది. అందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చాను. తిరిగి వైసీపీలో చేరే ఉద్దేశం కూడా లేదని” ప్రకటించారు
