సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ లో కీలక పదవులు దక్కాయి. ముఖ్యంగా గత వైసీపీ సర్కార్ లో రెబల్ ఎంపీ గా ఎంతో రిస్క్ చేసి ప్రభుత్వ నిర్ణయాలపై సుదీర్ఘంగా 4న్నర ఏళ్ళు పోరాడి అధినేత జగన్ పతనానికి కీలక పాత్రధారిగా రఘురామా నిలిచారు. అపట్లో తిరుగులేని వైసీపీ విజయ పధంలో ఉన్న జగన్ ను ఎదిరించడానికి .3 పార్టీల కూటమి అవసరం ముందుగా గుర్తించి దాని ఏర్పాటు కోసం కీలకంగా వ్యవహరించిన ప్రస్తుత టీడీపీ పార్టీ ఉండి ఎమ్మె ల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు ను అసెంబ్లీ ఉప సభాపతిగా ప్రతిపాదిస్తూ ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అంతకు మించి పదవి వస్తుందని (స్పీకర్ లేదా టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని ఆశించిన అయన శ్రేయోభిలాషులకు ఇది కాస్త ఓదార్పు గానే పరిగణించాలి. ఎందుకంటే ఇదే ఉండి సరిహద్దు భీమవరం ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ కొయ్య మోషేను రాజు ప్రస్తుతం రాష్ట్ర శాసన మండలి చైర్మెన్ గా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. అయితే స్పీకర్ సిటు లో కూర్చోవాలనే రఘురామా ఆశ పాక్షికంగా నెరవేరుతుంది. ఇక జనసేన పార్టీకి చెందిన నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మరియు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్లకు ప్రభుత్వ విప్ లుగా నియమించడంతో జిల్లా జనసేన లో హర్షం వ్యక్తం అవుతుంది.
