సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి రోజు, నేడు, మంగళవారం మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రజా సాధికార సర్వే పేరుతొ సేవామిత్ర యాప్ ద్వారా ప్రజలకు సంబందించిన వ్యక్తిగత సమాచారం టీడీపీ సంబధిత వ్యక్తులకు అందిందని , చోరీ అయ్యిందని నేడు సభాసంగం మధ్యంతర నివేదిక ప్రకటించడం తో తెలుగుదేశం నేతల గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయని, అటువంటి సాఫ్ట్ వేర్ చంద్రబాబు కొనుగోలు చేసాడని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా గతంలోనే ప్రకటించారని గుర్తు చేసారు. ఇప్పుడు హౌస్ కమిటీ నివేదికపై వెంటనే చంద్రబాబు స్టే తెచ్చుకోకుండా కోర్టుకు వెళ్ళితే జైలుకు వెళ్ళటం ఖాయం అని జోస్యం చెప్పారు. నారా లోకేష్, తిప్పలు చుస్తే జాలి కల్గుతుందని…ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన బొమ్మతో అన్న క్యాంటీన్లు అంటూ రాజకీయం చేస్తున్న చంద్రబాబు కు ఎన్టీఆర్ పైన ప్రేమ ఉంటే సీఎంగా సంతకం పెట్టిన మొదటి రోజే అన్నా క్యాంటీన్ పెట్టుండేవాడన్నారు. కానీ ఎన్నికలకు ముందు 3 నెలల ముందు హడావిడిగా ప్రారంభించాడని ఎద్దేవా చేసారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలను ఎగరకొట్టిన దౌర్భాగ్యుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. ఏనాడైనా మంచి పథకం పెట్టాలన్న ఆలోచనైనా చంద్రబాబు చేశాడా? అని ప్రశ్నించారు. ఇప్పుడు దేశమంతా వైఎస్ జగన్ వైపు చూస్తున్నారని, ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక విలువలు లేని వ్యక్తి అని దూషించారు. ఏ ఎన్నికల్లో ఎవరికి ఓటేయమని చెబుతాడో తెలియదన్నారు. షూటింగ్‌లు లేని సమయంలో ప్యాకేజ్ తీసుకుని ప్రెస్ మీట్లు పెట్టడమే పవన్ పని అని , తమను తిడితే ఆకాశం మీద ఉమ్మినట్లేనని రోజా విమర్శించారు.
