సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ప్రపంచ ప్రఖ్యాత ఆస్ట్రేలియన్ ఓపెనింగ్ బ్యాటమెన్ డేవిడ్ వార్నర్ కి తెలుగు సినిమా , తెలుగు సినీ హీరోలు అన్న వారి డాన్సులు, డైలాగ్స్ అంటే ఎంత క్రేజీ యో అందరికి తెలిసిందే.. .క్రికెట్ స్టేడియంలో విధ్వంసకర ఆటతీరుతో చెలరేగిపోయే వార్నర్ ఇప్పుడు ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో తెలుగు సినిమాల రీల్స్ అండ్ డైలాగ్స్ రిక్రియేట్ చేస్తూ వైరల్ కంటెంట్ అద్భుతంగ చేసాడు.అలాగే స్టార్ హీరోలు బన్నీ, మహేష్ బాబు తదితరులు కూడా వార్నర్‌కి రెస్పాండ్ కావడంతో తెలుగు ప్రజలు ఆయనని తెలుగు సినిమాలో చూడాలని ఎంతోగా కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రేక్షకుల కోసం వార్నర్ డేవిడ్.. నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న ‘రాబిన్ హుడ్’ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వెంకీ కుడుముల వార్నర్ కోసం ప్రత్యేకంగా ఓ కామెడీ ట్రాక్ కూడా రాసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో మొదట్లో హీరోయిన్‌గా రష్మికను అనుకున్న తర్వాత శ్రీలీలాని మార్పు చేసారు.
