సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:  ఓ వైపు ప్రభుత్వాలు డ్రగ్స్ వ్యతిరేక పోరాటాలు. భీషణ ప్రతిజ్ఞలు చేస్తుంటే.. మరోవైపు.. తెలంగాణలోని మొయినాబాద్ లో ఒక పామ్ హౌస్ ఇంటిపై గత రాత్రి జరిగిన అధికారుల దాడిలో డ్రగ్స్ కేసులో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారిలో ..తెలుగుదేశం పార్టీకి చెందిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కు సైతం డ్రగ్స్ పాజిటివ్ అని నేటి ఆదివారం ఉదయం నిర్ధారణ అయింది. గత శనివారం రాత్రి నెగిటివ్ వచ్చినప్పటికీ.. ఇవాళ ఉదయం మరోసారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ ప్రకటించారు. సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి పార్టీలో వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు ఎంపీపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి సహా.. ఐదుగురికి డ్రగ్స్ పరీక్షల్లో పాటిజివ్ రాగా.. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌కు డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఈగల్ ఎస్పీ గిరిధర్ అధికారికంగా ప్రకటించారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *