సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటి బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. పవన్ నేటి ఏపీ క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి డిప్యూటీ సీఎం నేరుగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ్నుంచి అమిత్ షా ఇంటికి వెళ్లారు. అనంతరం ఆయనతో పవన్ మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఏది ఏమైనా ఇటీవల రాష్ట్రంలో పరిస్థితులపై హోమ్ మంత్రి ఫై మండిపడ్డ పవన్ నేడు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలవడం కీలక పరిణామం గానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. .ఇరువురి మధ్య దాదాపు 12 నిమిషాల పాటు చర్చ జరిగింది. సహకార శాఖతోపాటు పంచాయతీ రాజ్, అటవీ పర్యావరణ శాఖల నుంచి ఏపీకి నిధుల కేటాయించాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలుపై అమిత్ షాతో పవన్ చర్చించారు.
