సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్. ముఖ్య మంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. సుమారు 40 నిముషాల పాటు వీరి ముఖాముఖి సమావేశం జరిగింది.. ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నా ప్రధాని మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఆయనతో కొద్దీ రోజుల ముందు సమావేశం కావడం ఆసక్తి రేకెత్తిస్తుంది. చంద్రబాబు ఆయనను మొదట శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవిని దర్శించుకోనున్న తరువాత కర్నూలులో నిర్వహిస్తున్న“సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ ” కార్యక్రమానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మర్యాద పూర్వకంగా ఆహ్వానించినట్లు తెలుస్తుంది. మరోవైపు, నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో తలపెట్టిన “CII పార్టనర్షిప్ సమ్మిట్” కు హాజరుకావాలని కూడా ప్రధాని నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది..
